Monday, February 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅవయవదాత చిన్నారికి అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికిన కేరళ

అవయవదాత చిన్నారికి అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికిన కేరళ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేరళలో అతి పిన్న వయస్కురాలైన అవయవదాత.. 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహంకు రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. ఐదుగురికి ప్రాణం పోసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ చిన్నారికి ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విదారక కార్యక్రమానికి వందలాది మంది హాజరై నివాళులర్పించారు. పథనంతిట్ట జిల్లాలోని ఓ చర్చిలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కేంద్ర మంత్రి సురేశ్ గోపి, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుఃఖాన్ని దిగమింగుతూ తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిలువుటద్దమని పలువురు కొనియాడారు.

ఫిబ్రవరి 5న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చిన్నారి అలిన్ తీవ్రంగా గాయపడింది. తల్లి, తాతయ్యలతో కలిసి ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ఫిబ్రవరి 12న బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో అలిన్ కాలేయం, కిడ్నీలు, గుండె కవాటాలు, కళ్లను ఐదుగురికి అమర్చారు. “మాటలకు అందని బాధలోనూ ఆ తల్లిదండ్రులు అవయవదానం చేసి కేరళ స్ఫూర్తిని చాటారు” అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -