- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇటివల కాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. ‘పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపే వ్యక్తి సోషల్ ప్రోగ్రెస్ గురించి చెప్పడం విడ్డూరం. దేశంలో అత్యంత తక్కువ అవినీతి, అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం మాది. అక్షరాస్యతలో మేమే ముందున్నాం. శాలరీలు, పెన్షన్లు ఆలస్యం చేసే మీరే మా దగ్గర పాలన, సంక్షేమం గురించి నేర్చుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
- Advertisement -



