Saturday, December 13, 2025
E-PAPER
Homeజాతీయంకేరళ స్థానిక సంస్థల ఎన్నికలు..ముందంజలో ఎల్‌డిఎఫ్‌

కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు..ముందంజలో ఎల్‌డిఎఫ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ ముందంజలో ఉంది. ఎలక్షన్‌ కమిషన్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం 10 : 15 గంటలకు ఎల్‌డిఎఫ్‌ 353 గ్రామ పంచాయతీ స్థానాల్లో ముందంజలో ఉంది. యుడిఎఫ్‌ 309 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక ఎన్‌డిఎ 30 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 941 గ్రామ పంచాయతీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది.

ఇక జిల్లా పంచాయతీ స్థానాల్లో 14 స్థానాలకు యుడిఎఫ్‌ ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది. ఆరు స్థానాల్లో ఎల్‌డిఎఫ్‌ ఉంది. ఈ స్థానాల్లో ఎన్‌డిఎ కానీ, ఇతర ఏ పార్టీలు కానీ మందంజలో లేవు. 87 మున్సిపాలిటీ స్థానాల్లో ఎల్‌డిఎఫ్‌ 30, యుడిఎఫ్‌ 48 స్థానాల్లో, ఎన్‌డిఎ ఒక స్థానంలోనూ, ఇతరులు రెండు స్థానాల్లోనూ లీడింగ్‌లో ఉన్నాయి. కార్పొరేషన్స్‌ ఆరు స్థానాలకు యుడిఎఫ్‌ 4, ఎల్‌డిఎఫ్‌ 1, ఎన్‌డిఎ 1 స్థానాల్లో ముందంజలోనున్నాయి. డిసెంబర్‌ 9,11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికలోడిసెంబర్‌ 13న శనివారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -