Thursday, May 29, 2025
Homeఅంతర్జాతీయండోమ్ గోల్డెన్‌పై ఉ.కొరియా అధ్య‌క్షుడు కీల‌క వ్యాఖ్యలు

డోమ్ గోల్డెన్‌పై ఉ.కొరియా అధ్య‌క్షుడు కీల‌క వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: బాలిస్టిక్‌, క్రూయిజ్ క్షిప‌ణుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు అమెరికా స‌ర్కారు గోల్డెన్ డోమ్‌ను రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.గోల్డెన్ డోమ్ ర‌క్ష‌ణ క‌వ‌చం.. అంత‌రిక్ష అణ్వాయుధ యుద్ధానికి దారి తీసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఉత్త‌ర కొరియా పేర్కొన్న‌ది. ఉత్త‌ర‌ కొరియాకు చెందిన విదేశాంగ శాఖ ఆ డోమ్ వార్త‌ల‌పై స్పందిస్తూ మూర్ఖ‌త్వంతో అమెరికా అలా వ్య‌వ‌హ‌రిస్తున్నట్లు ఆరోపించింది. అంత‌రిక్షాన్ని సైనిక క్షేత్రంగా మారుస్తున్న‌ట్లు ఉత్త‌ర కొరియా పేర్కొన్న‌ది. ట్రంప్ వేసిన ప్లాన్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అణ్వాయుధాల స‌మీక‌ర‌ణ‌ పెరుగుతుంద‌ని నార్త్ కొరియా వెల్ల‌డించింది. అమెరికా, ద‌క్షిణ కొరియా నిర్వ‌హిస్తున్న సైనిక విన్యాసాల‌ను కూడా ఉత్త‌ర కొరియా త‌ప్పుప‌ట్టింది. మిస్సైల్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ఒక‌వేళ అమెరికా పూర్తి చేస్తే, అప్పుడు ఆ క‌వ‌చాన్ని ఎదుర్కొనేందుకు ప్ర‌త్యామ్నాయ ఆయుధాల‌ను డెవ‌ల‌ప్ చేయాల్సి ఉంటుంద‌ని ఉత్త‌ర కొరియా తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -