నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. మే7న ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రశిబిరాలపై ఇండియన్ ఫైటర్ జెట్స్ విధ్వంసం సృష్టించాయి. ఈ దాడిలో 100మందికి పైగా ఉగ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పాక్‌కు తుర్కియే, అజర్‌బైజాన్ మద్దతుగా నిలిచి..డ్రోన్లు, క్షిపణులతో పాటు జైవాన్లు పంపి..భారత్ ను వెన్నుపొటు పొడిచిచాయి. ఈ క్రమంలో ఆదేశాలకు చెందిన పలు రకాల వస్తువులను పలు రాష్ట్రాల ఇండియన్ వ్యాపారులు బాయ్ కాట్ చేస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రైతులు కూడా అదే బాటలో నడిచారు. తుర్కియే కు చెందిన అన్ని రకాల వస్తువుల కొనుగోలు, అన్ని రకాల ఆపిల్ దిగుమతులపై నిషేధం విధించామని, ఆ రాష్ట్ర రైతు సంఘాలు తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించాయి. తమ తీర్మాన కాపీని ప్రధాని మోడీకి, రాష్ట్రపతికి తమ రాష్ట్ర గవర్నర్ ద్వారా అందజేస్తామని తెలిపారు.
