Friday, December 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు విడుదల

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇవాళ‌ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వారాల పాటు కస్టడీలో విచారించిన అనంతరం, గడువు ముగియడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయనను విడిచిపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈనెల‌ 12న సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావును అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించడం లేదని భావించి కస్టడీని పొడిగించారు. పదవీ విరమణ తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను ఎస్ఐబీ చీఫ్‌గా ఎందుకు నియమించిందనే కోణంలో సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావుతో తరచూ ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించగా, మావోయిస్టుల ముప్పు గురించి వివరించడానికేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -