- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మోల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణ ఉంటుందని పేర్కొంది. కాగా ఇటివల నవీన్ రావు కూడా విచారణకు హజరైన విషయం తెలిసిందే.
- Advertisement -



