నవతెలంగాణ-హైదరాబాద్: ఘజియాబాద్ లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల కొరియన్ లవ్ గేమ్’’కు బానిసై 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య సంఘటన దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల తాజాగా దర్యాప్తు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సదురు పిల్లల తండ్రి చెప్పే సమాధానాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని సమాచారం.
చేతన్ కుమార్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నట్లు ఒప్పకున్నాడు. 2010లో మొదటి వివాహం సుజాతతో జరిగింది. రెండో వివాహం 2013లో హినాతో జరిగింది. మూడో వివాహం 2018లో టీనాతో జరిగింది.ఇక వివాహాలకు సంబంధించిన పత్రాలు చూపించమంటే చూపించలేకపోతున్నాడు.
తొలుత ముగ్గురు అక్కాచెల్లెళ్లు ‘‘కొరియన్ లవ్ గేమ్’’కు బానిసై 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది.దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ ప్రాంతంలోని భారత్ సిటీలో చేతన్ కుమార్ నివాసం ఉంటోంది. 3 BHK ఫ్లాట్‌లో కుటుంమంతా ఉంటోంది. 3 BHKలో 3 గదులు ఉండగా కుటుంబమంతా ఒకే గదిలో పడుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. చేతన్ కుమార్‌కు ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు ఆడపిల్లలు కాగా.. ఒక కుమారుడు ఉన్నారు. ఈ సమాచారం పోలీసులను ఆశ్చర్యపరిచింది.
ఇక దర్యాప్తులో అమ్మాయిల దగ్గర రెండు మొబైల్స్ ఉన్నట్లుగా కనిపెట్టారు. అప్పుల కారణంగా రెండు ఫోన్లు చేతన్ కుమార్ అమ్మేశాడు. ఒకటి ఆరు నెలల క్రితం.. ఇంకొకటి 15 రోజుల క్రితం అమ్మేశాడు. ప్రస్తుతం ఆ రెండు ఫోన్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్‌లను ఫార్మాట్ చేసి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.చేతన్ కుమార్ గతంలో క్రెడిట్ కార్డు బ్రోకర్‌గా పని చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.



