- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చమురు, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన డేటాను సమర్పించాలని ఆదేశించింది. ఈ సమాచారం ఆధారంగా ఇంధన సరఫరా గొలుసును మరింత సమర్థవంతంగా పర్యవేక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.
- Advertisement -



