Friday, May 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమావోయిస్టు కీల‌క నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీల‌క నేత హిడ్మా అరెస్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు ఎన్‌కౌంట‌ర్ అయిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. మ‌రో కీల‌క నేత‌ను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ బీజాపూర్ జిల్లాలోని జ‌న‌గూడ‌కు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంట‌రీ ఫోర్స్ బృందాలు ప్ర‌త్యేక ఆపరేష‌న్ చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో బోయిప‌రిగూడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని పెట‌గూడ గ్రామ స‌మీపంలోని అడ‌వుల్లో హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచ‌రిస్తున్నార‌ని ప‌క్కా స‌మాచారం అంద‌డంతోనే.. పోలీసులు అక్క‌డ కూంబింగ్ నిర్వ‌హించిన‌ట్లు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు.ర్ : మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు ఎన్‌కౌంట‌ర్ అయిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. మ‌రో కీల‌క నేత‌ను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ బీజాపూర్ జిల్లాలోని జ‌న‌గూడ‌కు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంట‌రీ ఫోర్స్ బృందాలు ప్ర‌త్యేక ఆపరేష‌న్ చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో బోయిప‌రిగూడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని పెట‌గూడ గ్రామ స‌మీపంలోని అడ‌వుల్లో హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచ‌రిస్తున్నార‌ని ప‌క్కా స‌మాచారం అంద‌డంతోనే.. పోలీసులు అక్క‌డ కూంబింగ్ నిర్వ‌హించిన‌ట్లు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -