నవతెలంగాణ-హైదరాబాద్: గతేడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో పలువురు చనిపోగా.అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ టెర్రర్ అటాక్ పై ఐక్యరాజ్యసమితి కీలక నివేదిక విడుదల చేసింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న జైషే మహమ్మద్ ఉగ్రమూకతో సంబంధం ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. పాకిస్థాన్లో ఆర్థికపరమైన ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నా.. జైషేతోపాటు పలు ఉగ్రమూకలు సౌత్ ఏషియాలో క్రియాశీలకంగా పావులు కదుపుతున్నాయని కూడా తెలిపింది. జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి ఘటనను కూడా ఈ నివేదికలో ప్రస్తావించింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు హతమైనట్లు కూడా తెలిపింది. జైషే, లష్కరే తొయిబా వంటి ఉగ్రమూకలు తమ దేశంలో ఉనికిలో లేవని కొంతకాలంగా పాకిస్థాన్ వాదిస్తుండగా.. తాజాగా వచ్చిన నివేదికతో పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది.
ఎర్రకోట పేలుళ్లపై ఐక్యరాజ్యసమితి కీలక రిపోర్టు
- Advertisement -
- Advertisement -



