Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజీబీవీ.. కేరాఫ్ బల్మూరు

కేజీబీవీ.. కేరాఫ్ బల్మూరు

- Advertisement -

– చదువులో సక్సెస్ కు కృషి : ఎస్ఓ లలితతో ఇంటర్వూ..

విద్యార్థినీల తల్లిదండ్రుల సహకారం, అధికారుల ప్రోత్సాహం, ప్రజా ప్రతినిధుల అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఉన్నాయి. క్రమశిక్షణతో చదువుతున్న విద్యార్థినీలు, చక్కటి బోధన చేస్తున్న ఉపాధ్యాయ టీచింగ్ సిబ్బంది ఉన్నారు. భోజనంలో మెనూ పాటించేందుకు సహకరిస్తున్న పనివారు పరిశుభ్రతకు పాటుపడుతున్న వర్కర్లు అందరి సమన్వయంతో ముందుకెళ్తున్నాం అంటున్నారు కేజీబీవీఎస్ఓ. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల కళాశాల ఆదర్శవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్న కళాశాల పాఠశాల ఎస్ఓ లలిత ప్రత్యేక ఇంటర్వ్యూ బల్మూరు 

నవతెలంగాణ:  ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను ఎలా సిద్ధం చేస్తున్నారు? 

ఎస్ ఓ: 2026 ఫిబ్రవరి 25న ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. ఉదయం 4:30 నుండి 7:30 వరకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాము. సాయంత్రం ఐదు గంటల నుండి 6:30 వరకు మరియు రాత్రి 7:30 నుండి 10: 30 వరకు సబ్జెక్టు వారీగా టీచర్స్ స్టడీ హవర్స్ నిర్వహిస్తున్నారు. 2025 – 26 విద్యా సంవత్సరంలో కూడా 100% ఉత్తీర్ణత సాధిస్తామని ధీమా ఉంది. మన పరిసర ప్రాంతాల్లో బల్మూరు కేజీబీవీ అంటే చదువులో మంచి పేరు ఉందని అనుకుంటున్నాము. కేజీబీవీ కేరాఫ్ బల్మూరు అంటారు.

నవతెలంగాణ: వసతుల కల్పన నిర్వహణ ఎలా ఉంది? 

ఎస్ ఓ: విద్యార్థినిలకు అన్ని వసతులు ఉన్నాయి. చిన్నపాటి సమస్యలు తప్ప.. చెప్పుకునేంత లేవు. సివిల్ వర్క్స్ నిర్వహణలో భాగంగా విద్యుత్తు మరమ్మతు పనులు చేయిస్తున్నాం. రెండో ఫ్లోర్ బిల్డింగ్ లో మరమ్మతులు   జరుగుతున్నాయి. విద్యుత్తు సమస్య ఏ గదిలో లేకుండా రిపేర్ పనులు చేయిస్తున్నాం.

నవతెలంగాణ: పాఠశాల కళాశాలలో విద్యార్థుల సంఖ్య? 

ఎస్ ఓ: ప్రస్తుత విద్యా సంవత్సరం మొత్తం విద్యార్థినుల సంఖ్య 386. ఇంటర్ మొదటి రెండో సంవత్సరం  114 మంది విద్యార్థినులు, పాఠశాలలో 272 మంది విద్యార్థినీలు ఉన్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనంతోపాటు మంచి బోధన అందిస్తున్నాము అని చెప్పుకోవడానికి కూడా మాకు సంతోషంగా ఉంది. విద్యార్థుల పరిశుభ్రత ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాము.

నవతెలంగాణ: సామాజిక అవగాహన కార్యక్రమాలు? 

ఎస్ ఓ: సామాజిక అవగాహన కార్యక్రమాలు కంపల్సరీ నిర్వహిస్తాము. సెలవు రోజుల్లో వీలు చూసుకుని సామాజిక మానసిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. పోలీసు శాఖ వారితో, షీ టీం అధికారులతో విద్యార్థినిలకు సమావేశాలు నిర్వహిస్తుంటాం. ఆరోగ్య శిబిరాలను సైతం నిర్వహిస్తుంటాం. సైబర్ నేరాలు మోసాల పట్ల మరియు మానసిక సమస్యల పట్ల చైతన్యవంతం చేస్తారు. ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారం వ్యాయామం, యోగా, ఆటలు నిర్వహిస్తాం. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి మా కేజీబీవీ సిబ్బంది అందరం కృషి చేస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -