Monday, December 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలురోడ్డు ప్రమాదంలో ఖైరతాబాద్ ఏఆర్‌ ఎస్‌ఐ ఇంటెలిజెన్స్ మృతి..

రోడ్డు ప్రమాదంలో ఖైరతాబాద్ ఏఆర్‌ ఎస్‌ఐ ఇంటెలిజెన్స్ మృతి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ ఎస్‌ఐ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నారపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్ రావు నగర్, అన్నోజిగూడ, ఘట్కేసర్ మండలానికి చెందిన జగ్గాన్ని రఘుపతి(59) తండ్రి రమణ ఖైరతాబాద్‌లో ఇంటెలిజెన్సీలో ఏఆర్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉప్పల్ నుండి అన్నోజిగూడ వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. వెనుకవైపు నుండి టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. టిప్పర్ నడుపుతున్న వ్యక్తి కోహెడ గ్రామం అబ్దుల్లాపూర్‌మెట్‌కి చెందిన డ్రైవర్ లింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టిప్పర్ వాహనం నిర్లక్ష్యంగా అతివేగంగా వెనుక నుండి ఢీకొనడంతోనే రఘుపతి మరణించారని స్థానికులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, నిందుతున్ని అదుపులోకి తీసుకున్నామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -