Saturday, September 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలు‘రేపు ఆరు గంటలకు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం’

‘రేపు ఆరు గంటలకు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం’

- Advertisement -
  • హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రేపు ఉదయం ఆరు గంటలకు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం రెండు గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. న‌గ‌రంలో నిమజ్జనం ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..నిమజ్జనం కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. 3,200 మంది పోలీసులు రెండు షిఫ్టులలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నిమజ్జనంలో పాల్గొనే భక్తులు ప్రజారవాణా సదుపాయాలను ఎక్కువగా ఉపయోగించుకోవాలని సూచంచారు.

గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాల సంద‌ర్భంగా న‌గ‌రంలో ట్రాఫిక్ జాం కాకుండా తామంత నెల ముందే ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నామ‌న్నారు.ఆర్ అండ్ బీ, సమాచార శాఖ, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, రవాణా, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -