Saturday, July 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఖమేనీ కీల‌క నిర్ణ‌యం..నూత‌న క‌మాండ‌ర్లు నియ‌మాకం

ఖమేనీ కీల‌క నిర్ణ‌యం..నూత‌న క‌మాండ‌ర్లు నియ‌మాకం

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇజ్రాయిల్‌ దాడుల్లో మరణించిన ఇద్దరు అగ్ర సైనిక కమాండర్ల స్థానాల్లో ఇరాన్‌ సుప్రీంనేత అయాతుల్లా అలీ ఖమేనీ నూతన కమాండర్లను నియమించారు. జనరల్‌ మొహమ్మద్‌ బఘేరీ స్థానంలో జనరల్‌ అబ్దుల్‌ రహీం మౌసావిని సాయుధ దళాల కొత్త చీఫ్‌గా నియమించినట్లు స్థానిక మీడియా తెలిపింది. మౌసావి గతంలో సైనిక అగ్ర కమాండర్‌గా విధులు నిర్వహించారు. జనరల్‌ హుస్సేన్‌ సలామీ స్థానంలో పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌గా మొహమ్మద్‌ పాక్‌పూర్‌ను నియమించారు. 1979 ఇస్లామిక్‌ విప్లవం తర్వాత నియమించిన ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ దేశ అత్యున్నత సాయుధ దళాల్లో ఒకటి. ఇజ్రాయిల్‌ శుక్రవారం ఉదయం జరిపిన దాడుల్లో ఇద్దరు అగ్ర సైనిక కమాండర్లు మరణించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -