నవతెలంగాణ-హైదరాబాద్: పీఎం మోడీ మణిపూర్ పర్యటనపై కాంగెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ఓ ప్రణాళిక ప్రకారమే ప్రధాని మణిపూర్‌కు వెళ్లారని, ఆయన పర్యటనలో భాగంగా కేవలం మూడు గంటలు సమయం కేటాయిండం విడ్డూరంగా ఉందని ఖర్గే మండిపడ్డారు. ఈ మూడు గంటల హడవిడికి..భారీ బందోబస్తు నడుమ ఆ రాష్ట్రానికి వెళ్లి ఏమి ఉద్దరిస్తారని ప్రధాని మోడిని ప్రశ్నించారు. కేవలం మూడు గంటలు కేటాయించి..మణిపూర్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు.
సహాయ శిబిరాల్లోని ప్రజల కష్టాలను వినకుండా “పిరికితనంతో తప్పించుకోవడం తప్ప మరేమీ కాదు”. “మణిపూర్‌లో మీ 3 గంటల పిట్ స్టాప్ కరుణ కాదు – ఇది ఒక ప్రహసనం, టోకెనిజం, గాయపడిన ప్రజలకు తీవ్ర అవమానం. ఈరోజు ఇంఫాల్, చురాచంద్‌పూర్‌లలో మీరు చేసిన రోడ్‌షో, సహాయ శిబిరాల్లోని ప్రజల కేకలు వినకుండా పిరికితనంతో తప్పించుకోవడం తప్ప మరొకటి కాదు!’ అని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.