- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాక్‌లో కిడ్నాప్ అయిన అమెరికాకు చెందిన మహిళా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్ విడుదల అయ్యారు. ఈ విషయాన్ని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధ్రువీకరించారు. మార్చి 31న బాగ్దాద్‌లోని ఇరాక్ చెందిన మిలీషియా గ్రూపు సభ్యులు ఆమెను అపహరించారు. దీంతో ఆమె ఆచూకీ కోసం అక్కడి పోలీసులు, అమెరికా అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఆమెను వెతకడంలో సహాయం చేసినందుకు ఇరాక్ అధికారులకు రూబియో ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



