Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంకిడ్నాప్‌…హింస

కిడ్నాప్‌…హింస

- Advertisement -

– లండన్‌ కోర్టులో భారత ప్రభుత్వంపై మెహుల్‌ చోక్సీ కేసు
– విచారణ ప్రారంభం
లండన్‌:
మెహుల్‌ చోక్సీ గుర్తున్నాడా? ఒకప్పుడు భారత పౌరుడిగా ఉన్న ఈ వజ్రాల వ్యాపారి ఇప్పుడు కరేబియన్‌ రాష్ట్రమైన ఆంటిగ్వా-బార్బుడా జాతీయుడు. చట్టం నుంచి తప్పించుకొని పారిపోయిన వ్యక్తిగా భారత అధికారులు ఆయనపై ముద్ర వేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను 1.3 బిలియన్‌ పౌండ్ల మేరకు మోసం చేసి పరారయ్యాడంటూ ఆయనపై కేసు పెట్టారు. తాజాగా…చోక్సీ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా లండన్‌లోని హైకోర్టులో వేసిన ఓ సివిల్‌ దావా సోమవారం విచారణకు వచ్చింది. భారత ప్రభుత్వం కిడ్నాపింగ్‌కు, హింసకు పాల్పడిందని, తనను అక్కడికి రప్పించేందుకు కుట్ర చేస్తోందని ఆయన అందులో ఆరోపించారు. తనకు నష్టపరిహారం ఇప్పించాలని అభ్యర్థించారు. ‘భారత్‌లో చోక్సీ ఎదు ర్కొంటున్న ఆరోపణలు ఏవైనప్పటికీ ఆయనను అపహరించి, హింసిం చడంలో భారత ప్రభుత్వ ప్రమేయాన్ని సమర్థించలేము’ అని కోర్టులో ప్రాసిక్యూషన్‌ వాదించింది. భారత ప్రభుత్వం తరఫున ఏజెంట్లుగా పనిచేసిన ఐదుగురు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్నారు. చోక్సీ ఏప్రిల్‌ 12 నుంచి బెల్జియం జైలులో ఉన్నారు. ఆయనను భారత్‌కు అప్పగించేందుకు అక్కడ చట్టపరమైన చర్యలు చేపట్టారు. కాగా ఈ కేసును విచారించడానికి లండన్‌ కోర్టుకు ఉన్న పరిధిని విచారణ సందర్భంగా భారత్‌ ప్రశ్నించింది. భారత ప్రభుత్వం తో పాటు నలుగురు భారత సంతతికి చెందిన వారు, ఒక హంగేరి యన్‌ మహిళ ఈ కుట్రలో భాగస్వాములని చోక్సీ ఆరోపించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad