నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని చిత్రదుర్గం పట్టణ శివార్లలోని గోనూరు వద్ద పొలంలో డిగ్రీ విద్యార్థినిని అత్యంత దారుణంగా హత్యచేసి దహనం చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ ఉదంతంపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సగం కాలిన స్థితిలో ఉన్న యువతి మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన యువతి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో యువతి చేతికి వేయించుకొన్న టాటూ ఆధారంగా హిరియూరు తాలూకా కోవేరహట్టికి చెందిన డిగ్రీ విద్యార్థిని వర్షిత (19)గా గుర్తించారు. ఆమె పట్టణంలోని ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం బీఏ డిగ్రీ చదువుతూ ఇక్కడ ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో ఉంటోందన్నారు. గుర్తుతెలియని దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి గుర్తించడానికి వీలు లేకుండా పెట్రోలు పోసి దహనం చేయడానికి ప్రయత్నించారన్నారు. ఆ సమయంలో వర్షం మొదలవడంతో మంటలు ఆరిపోగా మృతదేహం సగం కాలిపోయింది.
విద్యార్థినిని చంపేసి.. ఆనవాళ్లు లేకుండా కాల్చేసి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES