Thursday, May 29, 2025
Homeసినిమాభిన్న కాన్సెప్ట్‌తో 'కిల్లర్‌'

భిన్న కాన్సెప్ట్‌తో ‘కిల్లర్‌’

- Advertisement -

‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్‌ పీస్‌’ వంటి డిఫరెంట్‌ సినిమాలతో మూవీ లవర్స్‌ దష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్‌ ‘కిల్లర్‌’ అనే సై-ఫై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, విశాల్‌ రాజ్‌, దశరథ, చందూ, గౌతమ్‌ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఏయు అండ్‌ఐ, మెర్జ్‌ ఎక్స్‌ఆర్‌ సంస్థతో కలిసి థింక్‌ సినిమా బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్‌ ప్రజరు కామత్‌, ఎ. పద్మనాభరెడ్డి. ఈ కొలాబ్రేషన్‌లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. సోమవారం ఈ మూవీ నుంచి హీరోయిన్‌ జ్యోతి పూర్వజ్‌ పోషించిన ‘రక్తిక’ క్యారెక్టర్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. ఆమె వ్యాంపైర్‌ లుక్‌లో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. మైథాలజీ, సైన్స్‌ ఫిక్షన్‌, సూపర్‌ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -