Wednesday, March 4, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP: కీవీస్ బౌల‌ర్ల ధాటికి స‌ఫారీల టాపార్డ‌ర్ కుదేలు

T20 WORLD CUP: కీవీస్ బౌల‌ర్ల ధాటికి స‌ఫారీల టాపార్డ‌ర్ కుదేలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఈడెన్ గార్డెన్‌లో కివీస్ బౌల‌ర్ల హ‌వా న‌డుస్తోంది. 80 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయింది స‌ఫారీ. మెగా టోర్నీలో వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌ను కివీస్ క‌ట్ట‌డి చేస్తోంది. 55 ర‌న్స్ కే స‌ఫారీల టాపార్డ‌ర్ కీవీస్ బౌల‌ర్లు ధాటికి కుదేలైంది. డికాక్(10),మార్క్‌ర‌మ్‌(18), మిల్ల‌ర్‌లు(6) నిరాశ‌ ప‌ర‌చ‌గా రికెల్ట‌న్ ప‌రుగుల ఖాతా తెర‌కుండానే పెవిలియ‌న్ చేరాడు.మెక్‌కాంచ్,ర‌చిన్ త‌లో రెండు వికెట్లు, నీష‌మ్ ఒక వికెట్ తీశారు.

మెక్‌కాంచ్ వేసిన మొద‌టి ఓవ‌ర్లో డికాక్,రికెల్ట‌న్ ఇద్ద‌రు స్వ‌ల్ప ప‌రుగుల‌కే బౌల్డ్ అయ్యారు. ఆ త‌ర్వాత ర‌చిన్ వేసిన‌ ఏడో ఓవ‌ర్లో మూడో బంతికి లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడినా మార్క్‌ర‌మ్ క్యాచ్ ఇచ్చి 18 ర‌న్స్ చేసి నిరాశ‌ప‌రిచాడు. ఆ త‌ర్వాత క్రీజులో వ‌చ్చిన మిల్ల‌ర్ కూడా సింగిల్ డిజిట్ ర‌న్స్ కే పెవిలియ‌న్ చేరాడు. త‌ర్వాత నీష‌మ్ వేసిన ఓవ‌ర్లోనే ఆదుకుంటాడు అనుకున్న బ్రెవిస్(34) కూడా నిరాశ‌ప‌రిచాడు. ప్ర‌స్తుతం 12 ఓవ‌ర్లు ముగిసేరికి సౌతాఫ్రికా స్కోర్: 99-5. క్రీజులో స్ట‌బ్స్(6), యాన్స్‌న్(15) ఉన్నారు.

ఈ క్ర‌మంలో టాస్ గెలిచిన కివీస్ సఫారీల‌ను బ్యాటింగ్‌ ఆహ్వానించింది. ఈ రోజు గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ వెళ్తుంది. మార్చి 8న తుది పోరు జ‌ర‌గ‌నుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -