నవతెలంగాణ-హైదరాబాద్: ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య మూడు వన్డేలో..టీమిండియా బౌలర్ల హవా నడుస్తోంది. భారత్ పేస్ ద్వయం కీవిస్ ఒపెనర్లను తొలి రెండు ఓవర్లు లోపే ఔట్ చేశారు. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.అయితే ఆట ఆరంభంలోనే కీవీస్ భారీ దెబ్బ తగిలింది. ఆర్షదిప్ సింగ్ వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికే హెచ్ నికోలస్, హర్షిత రాణా వేసిన సెకంట్ ఓవర్‌లో డీపీ కాన్వే పెవిలియన్ చేరాడు. యంగ్ 30పరుగులు చేసి క్యాచ్ అవుటైయ్యాడు. ప్రస్తుతం 27 ఓవర్లు ముగిసేరికి కీవీస్ స్కోర్: 142-3. క్రీజులో డీజే మిచెల్(22),జీడీ పిలిప్స్ ఉన్నారు.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ చివరిదైన మూడో వన్డే జరుగుతోంది. ఇండోర్ లో హోల్కర్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో సమంగా ఉన్నాయి.



