- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్- న్యూజిలాండ్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. నాగ్‌పుర్ వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కివీస్.. ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్ జరిగిన తీరు చూస్తే.. టీ20 పోరు కూడా హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ ముంగిట జరుగుతున్న చివరి సిరీస్ కావడంతో భారత్‌కు ఇది ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌కు సంబంధించి శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్‌లకు తుదిజట్టులో చోటుదక్కలేదు.
- Advertisement -



