- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో కొత్త మైలురాయి చేరుకున్నాడు. టెస్టుల్లో అతను 4 వేల పరుగుల వ్యక్తిగత మైలురాయి దాటాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అతను ఆ ఫీట్ అందుకున్నాడు. ఇక కోల్‌కతా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ ఔటయ్యాడు. అతను 82 బంతుల్లో 29 రన్స్ చేశాడు. రాహుల్, సుందర్ రెండో వికెట్‌కు 57 రన్స్ జోడించారు. రాహుల్ 27 రన్స్ చేసి క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఇండియా 35 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 79 రన్స్ చేసింది.
- Advertisement -



