Sunday, April 5, 2026
E-PAPER
Homeఆటలుక్లాసెన్, నితిష్ అర్ధ సెంచ‌రీలు..ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..?

క్లాసెన్, నితిష్ అర్ధ సెంచ‌రీలు..ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..?

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హోం గ్రౌండ్ ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన‌ మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓట‌ర్లకు గాను 9 వికెట్లు కోల్పోయి 156 ప‌రుగులు చేసింది. క్లాసెన్(54), నితిష్ కుమార్ రెడ్డి(50) అర్ధ‌సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ల‌ఖ్‌న‌వ్ బౌల‌ర్లు ష‌మీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ రెండు వికెట్లు, ర‌తి, సిదార్థ‌ త‌లా ఒక వికెట్ తీశారు.

మొద‌ట టాస్ గెలిచిన ల‌ఖ్‌న‌వ్ హైద‌రాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఆరంభంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఊహించిన షాకిచ్చింది ల‌ఖ్‌న‌వ్. మ‌హ్మ‌ద్ ష‌మీ హైద‌రాబాద్ ఓపెన‌ర్ల‌ను సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔట్ చేశాడు. తొలి ఓవ‌ర్లో ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్ కాగా, ఆ త‌ర్వాత టావిష్ హెడ్ కూడా పెవిలియ‌న్ చేరాడు. వీరిద్ద‌రి నిష్క‌మ‌ణ‌తో క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ ఇషాన్ కూడా ప్రిన్స్ వేసిన మూడో ఓవ‌ర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మూడు ఓవ‌ర్లకు 9 ప‌రుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది ఎస్‌ఆర్‌హెచ్‌. క్రీజులోకి వ‌చ్చిన లివింగ్ స్ట‌న్ 14 ప‌రుగులతో జోరుమీదున్న ఏడో ఓవ‌ర్లో పెవిలియ‌న్ చేరాడు. ఈక్ర‌మంలోనే క్లాసెన్(54), నితిష్ కుమార్ రెడ్డి(50) ఇన్సింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును న‌డిపించారు. ఈక్ర‌మంలోనే ఇరువురు బ్యాట‌ర్లు అర్ధ‌సెంచ‌రీలు పూర్తి చేశారు. వీలు చిక్కిన‌ప్పుడుల్లా ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ భారీ స్కోర్ దిశ‌గా బాట‌లు వేశారు. 9 వికెట్లు కోల్పోయి 156 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ల‌ఖ్‌న‌వ్ ముందుంచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -