- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వీధుల్లో సందడి చేశాడు. ప్రస్తుతం క్రికెట్‌కు విరామం తీసుకున్న ఆయన, కుటుంబంతో కలిసి హాయిగా సమయం గడుపుతున్నారు. ఇండియాలో ఉండే అభిమానుల కోలాహలానికి దూరంగా, ఒక సాధారణ పౌరుడిలా ఆయన లండన్‌లో తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో కోహ్లీ, అనుష్క స్థానికులతో ఆగి ముచ్చటిస్తున్నట్లు కనిపిస్తోంది. తమను గుర్తుపట్టిన వారితో ఈ సెలబ్రిటీ జంట నవ్వుతూ పలకరించడం, సరదాగా మాట్లాడటం వంటివి ఈ వీడియోలో ఉన్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా వారు తమ వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.
- Advertisement -