Thursday, September 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకొంపెల్లి వెంకట్ గౌడ్ కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

కొంపెల్లి వెంకట్ గౌడ్ కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, సామాజిక చరిత్రకారుడు కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణించారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకట్ గౌడ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ సాహిత్య రంగానికి ఇది పూడ్చలేని లోటని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వెంకట్ గౌడ్ కీలక పాత్ర పోషించారని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి ఆయన రాసిన ‘వొడువని ముచ్చట’ పుస్తకం, ఉద్యమానికి అవసరమైన రాజకీయ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ఎంతో దోహదపడిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ రచయితగా ఆయన అందించిన స్ఫూర్తిని మరువలేమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -