- Advertisement -
- జిల్లా నాయక్ పొడ్ అధ్యక్షులు శంకర్..
- నవతెలంగాణ – సారంగాపూర్
కొమురం భీమ్ పోరాటం స్ఫూర్తిదాయకం అని జిల్లా నాయక్ పొడ్ సంఘం అధ్యక్షుడు పోతుండ్ల శంకర్ అన్నారు. బుదవారం మండల కేంద్రంలో ఆదివాసీ నాయక్ పోడ్ ఆద్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడారు. కొమరం భీమ్ జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజనుల హక్కుల కోసం పోరాడిన యోధుడు ఆయన పోరాటం ఆదివాసీ ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిందని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ కౌన్సిలర్ పురడి శ్రీకాంత్, మండల నాయకులు ఎర్రం గంగన్న, తోట మల్లేష్, పరత్ గంగారం, సాయన్న, బోసాని భోజన్న, మెట్టు భోజన్నతోపాటు ఆయ గ్రామాల ఆదివాసులు పాల్గొన్నారు.
- Advertisement -