Sunday, September 21, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక  పోరాటం…

 కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక  పోరాటం…

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం: స్వాతంత్ర్యమే కాదు.. తెలంగాణ కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని జన్నారం మండల బీసీ సంఘ నాయకులన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని బీసీ సంఘం ఆధ్వర్యంలో అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఆసిఫాబాద్ జిల్లాలో  పుట్టిన ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆది గురువుగా నిలిచారు. 1969లో ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు.

‘తెలంగాణ పీపుల్స్ పార్టీ’ స్థాపించడమే కాక.. తెరాస ఆవిర్భావంలోనూ కీలకంగా వ్యవహరించారన్నారు. 96 ఏళ్లప్పుడూ స్వరాష్ట్రం కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారన్నారు.  కార్యక్రమంలో  బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కడార్ల నరసయ్య,  మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ , జన్నారం మండలం బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్ , జన్నారం మండల ముదిరాజ జ్ సంఘం ఉపాధ్యక్షుడు అయిలవేణి రవి , జన్నారం మండలం పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న , పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్ , శ్రీరాముల శివకుమార్ , రాగుల కిషన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -