Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుగాంధీభవన్‌కు కొండా మురళి

గాంధీభవన్‌కు కొండా మురళి

- Advertisement -

– టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు
– భారీ బందోబస్తు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలపై షోకాజ్‌ నోటీస్‌ అందుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీభవన్‌కు వచ్చారు. వరంగల్‌ నుంచి భారీ కాన్వారుతో ఆయన శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు చేరుకున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో ఆయన అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆయన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మెన్‌ మల్లు రవి, కమిటీ సభ్యుల ముందు హాజరయ్యారు. ఫిర్యాదులపై సమాధానం ఇవ్వాలంంటూ మల్లు రవి ఆయన్ను కోరినట్టు తెలిసింది. దీనికి ఆయన ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో చెప్పడంతోపాటు రాత పూర్వకంగా కూడా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కొండా మురళి కూడా క్రమశిక్షణ కమిటీకి కొంత మందిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వారి వివరణ కూడా కోరాలని క్రమ శిక్షణ కమిటీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం కొండా మురళీ మాట్లాడుతూ ‘నా వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చాను. కాంగ్రెస్‌ నేతలంటే నాకు గౌరవం ఉంది. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు. నేను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరాను. రేవంత్‌ రెడ్డి మళ్లీ సీఎం కావాలి. బీసీలకు మేలు జరగాలని 40 ఏండ్లుగా పోరాటం చేస్తున్నా. రాహుల్‌ గాంధీని ప్రధాని చేయాలనే తపన మా అందరిలో ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ చైర్మెన్‌ మల్లు రవి మాట్లాడారు. ‘మేం నోటీసు ఇస్తే కొండా మురళి వచ్చారు. ఆయన మాకు వివరణ ఇచ్చారు. రాత పూర్వకంగా కూడా వివరణ ఇచ్చారు’ అని తెలిపారు. వైఎస్సార్‌ సాన్నిహిత్యంతో కాంగ్రెస్‌పై తనకు అభిమానం పెరిగిందన్నారు. బహిరంగ విమర్శలు చేయడం మంచికో, చెడుకో అనేది తన అంతరాత్మకు తెలుసన్నారు. తాను తన పదవికి రాజీనామా చేసే కాంగ్రెస్‌లోకి వచ్చానన్నారు. కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి రాజీనామా చేస్తారో, లేదో ఆయనే తేల్చుకోవాలని సూచించారు. బీసీలను గౌరవించాలను కోరారు. తాను దేనికి భయపడనీ, సీఎం, పీసీసీ అంటే గౌరవం ఉందన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img