Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్3 ఇన్ 1 సూప‌ర్ ఎకౌంట్ ప్రారంభించిన కోట‌క్ 811

3 ఇన్ 1 సూప‌ర్ ఎకౌంట్ ప్రారంభించిన కోట‌క్ 811

- Advertisement -

* ఆదా, ఖ‌ర్చు, అప్పు, సంపాద‌న‌.. అన్నీ ఒక‌దాంట్లోనే

* సూప‌ర్.మ‌నీతో భాగ‌స్వామ్యంతో సుర‌క్షిత‌మైన కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్

నవతెలంగాణ ముంబై: భార‌త‌దేశంలో ప్ర‌ముఖ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం అయిన కోట‌క్ 811.. తాజాగా త‌న 3 ఇన్ 1 సూప‌ర్ ఎకౌంట్‌ను ప్రారంభించింది. ఇది ఒక సేవింగ్స్ ఎకౌంట్‌గా, ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా, సూప‌ర్.మ‌నీతో కూడిన ఒక సుర‌క్షిత‌మైన క్రెడిట్ కార్డుగా అన్నీ ఒక‌చోటే ల‌భిస్తాయి. సుల‌భంగా డిజిట‌ల్ ఆర్థిక టూల్స్ కావాల‌నుకునే భార‌తీయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారి కోస‌మే ఇది రూపొందింది. ఇందులో జీతాలు వ‌చ్చే వ్య‌క్తులు, డిజిట‌ల్ స్థానికులు, విద్యార్థులు, తొలిసారి ఉద్యోగాల్లో చేరిన‌వారు.. ఇలా అంద‌రూ ఉంటారు. చిన్న‌గా మొద‌లుపెట్టి, నియంత్ర‌ణ‌లో ఉండి, త‌మ డ‌బ్బుతో మ‌రింత సాధిస్తారు. ఈ 3 ఇన్ 1 సూపర్ ఎకౌంట్ వారి అవ‌స‌రాలు సుల‌భంగా తీరేలా రూపొందింది.

కోట‌క్ 811 అధినేత మ‌నీష్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ, “ఈ 3 ఇన్ 1 సూప‌ర్ ఎకౌంట్‌తో ఆదా, ఖ‌ర్చు, రుణాలు అన్నీ ఒక‌చోటే దొరుకుతాయి. కాగితాల‌తో ప‌ని, సంక్లిష్ట‌త లేకుండా డ‌బ్బు నిర్వ‌హించాల‌నుకునేవారికి ఇది స‌రిపోతుంది. ఇది చాలా సుల‌భం, సుర‌క్షితం, రోజువారీ అవ‌స‌రాల కోసం డిజైన్ చేసిన‌ది” అని చెప్పారు.

3 ఇన్ 1 సూపర్ ఎకౌంట్‌లో ఏముంటాయి

* రూ.1000తో మొద‌లుపెట్టండి. ఒక ఎఫ్‌డీ తెరిచి మొద‌ల‌వ్వండి

* మ‌రింత సంపాద‌న‌: ఎఫ్‌డీ మీద వ‌డ్డీ, ఖ‌ర్చుల‌పై క్యాష్ బ్యాక్‌

* క్రెడిట్‌తో యూపీఐ వాడండి: ఎప్ప‌టిలాగే చెల్లించండి, రివార్డులు పొందండి

* సుర‌క్షిత‌మైన కోట‌క్811 సూప‌ర్.మ‌నీ క్రెడిట్ కార్డ్: మీ ఎఫ్‌డీ ఉంది కాబ‌ట్టి ఆదాయ సాక్ష్యం అక్క‌ర్లేదు

* పేప‌ర్ ప‌ని లేదు: 100% డిజిట‌ల్ ఆన్‌బోర్డింగ్‌

* నియంత్ర‌ణ‌లో ఉండండి: మీ ఎఫ్‌డీ మీ ఖ‌ర్చుల‌ను నియంత్రిస్తుంది.

“మా ఆడియన్స్ కోట‌క్811 వినియోగ‌దారులు ఒక్క‌రే. ఈ డిజిట‌ల్ యూజ‌ర్లు అన్నీ సుల‌భంగా ఉండి, వాటితో రివార్డులు రావాల‌నుకుంటారు. క్రెడిట్‌ను చెల్లింపుల్లాగే సుల‌భంగా చేసేందుకు మేం డిజిట‌ల్ ఇన్నోవేష‌న్‌ను న‌మ్మ‌క‌మైన బ్యాంకింగ్‌తో క‌లుపుతున్నాం” అని సూప‌ర్.మ‌నీ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌కాష్ సికారియా చెప్పారు.

కోట‌క్811 కో-హెడ్ జై కోటక్ మాట్లాడుతూ“ప్రాక్టిక‌ల్ మార్గంలో ఆర్థికంగా ముందుకెళ్లాల‌నుకునే స‌గ‌టు భార‌తీయుల‌కు కోట‌క్ 811 సేవ‌లందిస్తుంది. వీళ్లంతా డిజిట‌ల్ యూజ‌ర్లే గానీ, క్రెడిట్‌తో జాగ్ర‌త్త‌గా ఉంటారు. వాళ్ల‌కు నియంత్ర‌ణ‌, స్ప‌ష్ట‌త‌, విలువ ఉండాలి. ఈ 3ఇన్‌1 సూప‌ర్ ఎకౌంట్ వీరికి స‌రిగ్గా స‌రిపోతుంది. సుల‌భంగా మొద‌లుపెట్టి, ఈజీగా ఉప‌యోగించి, త‌మ డ‌బ్బును నమ్మ‌కంగా పెంచుకోవ‌డానికి వీల‌వుతుంది” అన్నారు. ఎకౌంట్ కావాలంటే: చూడండి: kotak811.com/3in1SuperAccount లేదా సూప‌ర్.మ‌నీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -