Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మగ్గిడి సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్ ను పరామర్శించిన కోటపాటి

మగ్గిడి సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్ ను పరామర్శించిన కోటపాటి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
మండలంలోని మగ్గిడి గ్రామ నూతన సర్పంచ్ జి. చంద్రకాంత్ గౌడ్ ను రైతు నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు శనివారం పరామర్శించారు. చంద్రకాంత్ గౌడ్ తండ్రి చిన్న గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. కోటపాటితో కలిసి స్వదేశీ జాగరణ మంచ్ లో అనేక సంవత్సరాలు రైతు, గల్ఫ్ కార్మికుల ఉద్యమంలో కలిసి పనిచేసిన చంద్రకాంత్ గౌడ్ దుబాయ్ నుండి వచ్చి సర్పంచుగా పోటీ చేసి గెలిచిన సంతోష సమయంలో తండ్రిని కోల్పోవడం బాధాకరం. చంద్రకాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపం తెలిపారు. కోటపాటితో పాటుS. రుక్మాజీ, సునీల్ రావు కులకర్ణి, నరేష్ వర్మ, ఖానాపూర్ సర్పంచ్ నర్సింలు, అందాపూర్ సర్పంచ్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -