Friday, September 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకోఠి ఈఎన్‌టీ నాలాల‌ను వెంట‌నే మ‌ర‌మ్మ‌త్తు చేయాలి: హారీష్‌రావు

కోఠి ఈఎన్‌టీ నాలాల‌ను వెంట‌నే మ‌ర‌మ్మ‌త్తు చేయాలి: హారీష్‌రావు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘బ్లాక్ ఫంగస్’ వంటి మహమ్మారికి సైతం అద్భుతంగా సేవలు అందించిన కోఠి ఈఎన్‌టీ (ENT) ఆసుపత్రి ప‌రిస్థితి..ప్ర‌స్తుతం ఆధ్వానంగా మారింద‌ని మాజీ మంత్రి హారీష్‌రావు అన్నారు. ఆసుపత్రి నాలాల‌కు మరమ్మతులు చేయక పోవడంతో వర్షం పడుతున్న ప్రతీసారి పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నార‌ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో స్పందన లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వెంటనే నాలాల‌ మరమ్మతు పనులు చేపట్టాలని, వరద నీరు ఆసుపత్రికి చేరకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

కాగా,హైదరాబాద్‌లో గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వాన పడుతున్నది. దీంతో కోఠి ఈఎన్‌టీ దవాఖాన (Koti ENT Hospital) నీట మునిగింది. హాస్పిటల్‌లో మూడు అడుగుల మేర వరద నీరు నిలిచింది. వరద నీటికి తోడు డ్రైనేజీల్లో నుంచి సిల్ట్‌ రావడంతో ఇసుక మేట వేసింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -