Monday, August 11, 2025
E-PAPER
spot_img
HomeజాతీయంKSCA సెక్రటరీ రాజీనామా

KSCA సెక్రటరీ రాజీనామా

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కు సెక్రటరీ ఏ.శంకర్ , ట్రెజరర్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. గత రెండు రోజుల్లో ఊహించని దురదృష్టకర ఘటన జరగడం బాధకరమని, అందులో తమ పాత్ర చాలా పరిమితమైనదే అయినప్పటికీ నైతిక బాధ్యతను స్వీకరిస్తూ పదవులకు రాజీనామా చేస్తున్నామని మీడియా స‌మావేశంలో తెలిపారు. తమ రాజీనామా లేఖను ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు రఘురామ్ భట్‌ (Raghuram Bhat)కు అందజేశామ‌న్నారు.

కాగా, చిన్నస్వామి తొక్కిసలాట ఘటనలో తమపై దాఖలైన ఎఫ్ఐఆర్‌ లను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్, పలువురు ఆఫీస్ బేరర్లకు ఊరట లభించింది. ఈ మేరకు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులపై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img