నవతెలంగాణ-హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్‌ను ఆదివారం నందినగర్‌లోని ఆయన నివాసంలో ఐదు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. విచారణ ముగిసిన అనంతరం ప్రకటన చేస్తూ సజ్జనార్.. ‘ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్‌కు కౌంటర్ ఇచ్చారు.
‘కమిషనర్‌గారూ (సజ్జనార్‌ను ఉద్దేశించి) మీరే న్యాయమూర్తిగా, జ్యూరీగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతున్నారు. దయచేసి మీరు దర్యాప్తు బృందానికి చైర్మన్‌గా ఉన్నారనే విషయాన్ని గుర్తుచేసుకోండి. ఫోన్ ట్యాపింగ్ కేసు చట్టవిరుద్ధమా, చట్టబద్ధమా..? అనేది చట్టపరంగా కోర్టు ద్వారా నిరూపణ కావాల్సి ఉంది’ అని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.



