Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలు‘అన్నపూర్ణ పథకం’ పేరు మార్పుపై కేటీఆర్‌ ఫైర్

‘అన్నపూర్ణ పథకం’ పేరు మార్పుపై కేటీఆర్‌ ఫైర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న ‘అన్నపూర్ణ పథకం’ పేరు మార్పుపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డిపై ‘ఎక్స్‌’లో కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ బాస్‌లకు మీ విధేయత చూపించాలనుకుంటే మీ పేరును రాజీవ్‌ లేదా జవహర్‌గా ఎందుకు మార్చుకోకూడదని ప్రశ్నించారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అర్ధరహిత నిర్ణయాలన్నింటినీ రద్దు చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తున్నారు. ఇందిర క్యాంటిన్లుగా పేరు మార్చి.. రూ.5కే భోజనం, అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad