– ఆపదలో అండగా నిలిచి…
– సౌదీ నుండి మండేపల్లికి చేర్చిన కేటీఆర్ బృందం..
నవతెలంగాణ-తంగళ్ళపల్లి : ఆపదలో ఉన్న ఆదుకోవాలని ఓ కుటుంబం కేటీఆర్ ను వేడుకోగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ కుటుంబానికి అండగా నిలిచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు బతుకుదెరువు కోసం ఎడారి దేశం పోయిన యువకున్ని వెక్కిరించింది.సౌదీలో 15 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు తనతో పాటు ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందగా మహేష్ ఒక్కడే తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. దీంతో అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ సెల్పీ వీడియో ద్వారా తనను స్వదేశానికి తీసుకెళ్ళాలని కేటీఅర్ ను వేడుకున్నాడు.మహేష్ కుటుంబ సభ్యులను కలిసి మహేష్ తో వీడియో కాల్ లో మాట్లాడి వారి కుటుంబం తో పాటు మహేష్ కి కూడా ధైర్యం చెప్పి,ఆదుకుంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు.వెంటనే తన టీంను రంగంలోకి దింపి, సౌదీలోని మహేష్ కంపెనీ వాళ్ళతో మాట్లాడారు.కేటీఆర్ చొరవతో మహేష్ కు ట్రీట్మెంట్ చేస్తామని అంగీకరిస్తూ సౌదీలోని ప్రభుత్వ ఆసుపత్రికి కిమ్స్ యాజమాన్యం లేఖ రాశారు.చెప్పినట్లుగానే సౌది దవాఖాన నుంచి గురువారం మహేష్ ను అంబులెన్స్ ద్వారా కిమ్స్ ఆసుపత్రికి కేటీఆర్ బృందం, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, చేర్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఅర్ కు మహేష్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా కేటీఆర్ కు ఆయన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES