నవతెలంగాణ-హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాళులు అర్పించారు. మగ్దూం భవన్‌లో ఉన్న ఆయన పార్థీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సురవరం సుధాకర్ రెడ్డి మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సీపీఐ మద్దతులో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు మద్దతు కూడగట్టడంలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం బీఆర్‌ఎస్ పార్టీకి దక్కింది. కేసీఆర్ వారితో ఉన్న అనుభవాలను గుర్తుచేసుకున్నారని, వారి తరపున సువరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పిస్తున్నామని చెప్పారు. సురవరం సుధాకర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని, వారి కుటుంబసభ్యులకు, కమ్యూనిస్ట్ పార్టీకి, ప్రజా ఉద్యమాలు చేసిన వారికి మా నాయకుడి తరపున, తమ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.
సురవరం సుధాకర్ రెడ్డికి కేటీఆర్ నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES