- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మద్యం కుంభకోణం పేరుతో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని, అయితే ఈ కేసు వల్ల రాజకీయంగా నష్టపోయింది మాత్రం బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. కవితకు కోర్టులో న్యాయం జరిగిందని, ఇదే విధంగా తమ నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని, కల్పితమని త్వరలోనే తేలిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. చివరికి న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
- Advertisement -



