Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునేడు లండ‌న్ వెళ్ల‌నున్న కేటీఆర్

నేడు లండ‌న్ వెళ్ల‌నున్న కేటీఆర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR )నేడు లండన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో(Oxford University) ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొననున్నారు. ‘ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్ మెంట్ ఇన్ ఇండియా’ అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి ప్రసంగిస్తారు.

కేటీఆర్ బుధవారం రాత్రి బయలుదేరి తిరిగి ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ చేరుకుంటారు. అంతకు ముందు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్‌ పర్యటించారు. తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంటయ్య మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, తన భూమిని కాంగ్రెస్‌ నాయకుడు కబ్జా చేశాడని ఆరోపిస్తూ కుంటయ్య ఆత్మహత్య చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad