నవతెలంగాణ-నిజాంసాగర్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు 48వ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ అని అదే విధంగా హైదరాబాద్ ఐటి రంగంలో అనేక దేశ విదేశాల నుంచి వివిధ కంపెనీలను తీసుకువచ్చి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన నాయకుడు కేటీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అచ్ఛంపేట్ సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మల్లూరు సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షులు రమేష్ గౌడ్, నాయకులు శ్రీకాంత్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.