నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుక సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదేశాల మేరకు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. మాజీ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా కేటీఆర్ జన్మదిన వేడుకలో పాల్గొని నాయకులకు , కార్యకర్తలకు పేరుపేరునా పలకరించి ఉత్సాహపరిచారు. అంతకు ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించారు. భారీగా టపాసులు పేల్చీ ఘనంగా జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని బసవేశ్వర చౌక్ వద్ద నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ తో వెళ్లి ప్రభుత్వ ఆస్పత్రి లో కేటీఆర్ జన్మదిన సందర్భంగా గుర్తుగా మొక్కలు నాటి రోగులకు మరియు గర్భిణీ స్త్రీ లకు పండ్ల పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జుక్కల్ మండల టిఆర్ఎస్ నాయకులు నీలు పటేల్, వాస్రే రమేష్ , విట్టు పటేల్, బుల్లి గంగాధర్, భాను గౌడ్ , పడంపల్లి బస్వంత్ పటేల్ ( శ్రీను) , రవి పటేల్, శివరాజ్ దేశాయ్, సుంకరి వెంకన్న, తాటి భూమన్న, మోయిన్ ఖాన్, కిషన్ పవర్ , శివాజీ పటేల్, సాయిలు , మాధవ పటేల్ పడంపల్లి & కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES