చిన్నమెదడు చితకడంతో ఇష్టానుసారంగా మాటలు
కాంగ్రెస్‌పై లేనిపోని ఆరోపణలు : మంత్రి డాక్టర్ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేటీఆర్‌కు సిస్టర్ స్ట్రోక్ తగిలి చిన్న మెదడు చితికిందనీ, అందుకే ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంలో విషయంలో కమీషన్లు తీసుకున్న ప్పుడు లేని భయం కమిషన్ ముందుకొచ్చేందుకు ఎందుకని ప్రశ్నించారు. కాళేశ్వరానికి కాంగ్రెస్ బాంబులు పెట్టిందని ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిరూపించలేదో కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అబద్దాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని విమర్శించారు. గ్లోబల్ ప్రచారానికి కేటీఆర్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్ష హౌదాకు కేటీఆర్ పనికిరారని తేల్చిచెప్పారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయనీ కవిత చెప్పిందనీ, ఆ దెయ్యం తమరేనా? అని కేటీఆర్‌ను దెప్పిపొడిచారు. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. త్యాగాల మీద రాజభోగాలనుభవించిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి దోచుకుని దాచుకునే చరిత్ర అని ఆరోపించారు. భారత నీతిని ప్రదర్శించలేని మోడీని ట్రంపు నీతితో ముందుకు వెళ్తున్నాడని విమర్శించారు. రాహుల్ గాంధీ పై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రశంసల కోసం కేటీఆర్ పాకులాడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. పీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ పత్రిక, స్వతంత్ర ఉద్యమ గొంతుక కోసం తన వంతు సహాయం చేశారని చెప్పారు. అధికారం లేనప్పుడు అధికార దుర్వినియోగం ఎక్కడ జరిగిందో ఈడీ చెప్పాలని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ జరగలేదనీ, ఫెమా చట్టం ఉల్లంగించబడలేదనీ, ఆర్థిక అవకతవకలు లేవని స్పష్టం చేశారు. రాజకీయ ఉద్దేశంతో రాహుల్ గాంధీ గొంతునొక్కేందుకు మోడీ అత్యుత్సాహంతో కేసు పెట్టారని విమర్శించారు. పాకిస్తాన్తో యుద్ధం చేయలేక ఒత్తిడికి తలొగ్గారనే విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ దాన్ని తప్పుదారి పట్టించేందుకు ఈడీ కేసును తెరమీదకు తెచ్చారని చెప్పారు. ఎన్నికల బాండ్ల రూపంలో వేలకోట్ల ప్రజల సొమ్మును బీజేపీ కూడబెట్టుకున్నదని ఆరోపించారు. గులాబీ కూలీల రూపంలో వందల కోట్ల రూపాయలనును బీఆర్‌ఎస్ వసూలు చేసిందని విమర్శించారు.
కేటీఆర్‌కు సిస్టర్ స్ట్రోక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES