ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన తారాగణంగా శేఖర్ కమ్ముల రూపొందించిన పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌ఎల్‌వీ ఎల్‌ఎల్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
‘శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ తర్వాత ఈ ఐడియాని మాకు చెప్పారు. ఈ కథకు ధనుష్ అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆయనకి ఈ కథ చెప్పారు. ధనుష్ 20 నిమిషాలు కథ విని వెంటనే సైన్ చేశారు. ధనుష్ పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక గురించి అందరికీ తెలుసు. ఇండియాలో ఆమె పాపులర్ యాక్ట్రెస్. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్‌తో ఈ సినిమాని చేశాం. ధనుష్, నాగార్జున, రష్మిక అద్భుతంగా సపోర్ట్ చేశారు. అంతేకాదు అద్భుతంగా నటించారు కూడా.
మోస్ట్ రిచెస్ట్ మాన్ ఇన్ ద వరల్డ్, ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్ ఇదే ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్. శేఖర్ మంచి ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ని టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఉండే ఎమోషన్స్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయి. ఆడియన్స్‌కి న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే డిఫరెంట్ సినిమా ఇది.
రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్‌తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్‌లో తీసాం. బొంబాయిలో సినిమాని షూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాని చిత్రీకరించాం.
ఇది తెలుగు, తమిళం స్ట్రయిట్ మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ కాఫీ ఇప్పటికే రెడీ అయింది. సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమాని చాలా గ్రాండ్‌గా దాదాపు 1600 స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నాం. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది. దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ధనుష్ రెండు పాటలు పాడారు. శేఖర్ కమ్ములతో మరో సినిమా చేయనున్నాం. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు.
అందరికీ కనెక్ట్ అయ్యే ‘కుబేర’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES