ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ముఖ్య పాత్రధారులుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ధనుష్, రష్మిక మందన్న చిరునవ్వులతో కనిపించిన ఈ పోస్టర్ అందర్నీ విశేషంగా అలరిస్తోంది. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ అద్భుతమైన స్పందనతో అంచనాలను పెంచింది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ ‘పోయిరా మామ..’ చార్ట్ బస్టర్ హిట్ అయింది. మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ‘పోయిరా మామా’ సాంగ్‌తో ఈ సినిమా మీద ఉన్న హైప్ నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది. క్యారెక్టర్ బేస్డ్ నెరేటివ్స్‌తో అదరగొట్టే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్‌గా తీర్చిదిద్దారు. ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది అని చిత్ర యూనిట్ తెలిపింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీఎసీ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 20న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
భిన్న కాన్సెప్ట్‌తో ‘కుబేర’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES