- Advertisement -
నవతెలంగాణ-కుభీర్ : మండల కేంద్రమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం స్టేట్ అబ్జర్వర్ బృందం సభ్యులు ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని డి ఇ సి కన్వీనర్ జాదవ్ పరుశురాం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.పరీక్ష నిర్వహణ పరిశీలించిన బృందం నిబంధన ప్రకారం పరీక్షలు నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష లకు 138మంది విద్యార్థులకు గాను 134మంది విద్యార్థులు హాజరయ్యారని నలుగురు గైర్హాజరు అయినట్లు సి ఎస్ విజయ్ భాస్కర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో డి ఓ నర్సయ్య అధికారులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



