Monday, February 9, 2026
E-PAPER
Homeజాతీయంకుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌కు బెయిల్ నిరాక‌ర‌ణ‌

కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌కు బెయిల్ నిరాక‌ర‌ణ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి (జ్యుడిషియల్‌ కస్టడీ డెత్‌) మృతి కేసులో బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌కు బెయిల్‌ మంజూరు చేయడానికి సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందులో సెంగర్‌ నైతిక దుర్వినియోగానికి పాల్పడిన నేరాలు ఉన్నాయని సుప్రీం పేర్కొంది. అలాగే సెంగర్‌ శిక్షను పెంచాలని ఉన్నావో అత్యాచార బాధితురాలి కుటుంబం అప్పీల్‌ను ప్రాధాన్యతా ప్రాతిపదిక విచారించండని భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఢిల్లీ హైకోర్టును కోరింది. అతని అప్పీలును మూడు నెలల్లోగా నిర్ణయించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

బాధితురాలు కుటుంబం దాఖలు చేసిన శిక్షను పెంచాలని దాఖలు చేసిన అప్పీల్‌ను ఫిబ్రవరి 11న హైకోర్టు ముందు విచారణకు జాబితా చేస్తున్నట్లు సిబిఐ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తషార్‌ మెహతా సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

కాగా, ఆ కేసులో అప్పీలుదారుడు (బాధితురాలు) హైకోర్టు ముందు ఇదే విషయాన్ని ప్రస్తావించడానికి స్వేచ్ఛను కల్పిస్తున్నాం. ఢిల్లీ హైకోర్టు ఈ అప్పీల్‌ను వారం రోజుల్లోగా విచారణకు స్వీకరించాలి. ఒకవేళ సెంగార్‌ కూడా అప్పీలు చేసే అవకాశాన్ని హైకోర్టు భావిస్తే.. రెండింటినీ కలిపి విచారించి నిర్ణయం తీసుకోవాలని, దానికి బెంచ్‌ కూర్పులో మార్పు అవసరమైతే అదే చేయవచ్చు అని జస్టిస్‌ జోరుమల్య బాగ్జి, జస్టిస్‌ ఎన్వి అంజరియాతో కూడిన బెంచ్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -