Tuesday, October 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకర్నూల్ బస్సు ప్రమాదం..19వాహనాలు తప్పించుకున్నాయ్

కర్నూల్ బస్సు ప్రమాదం..19వాహనాలు తప్పించుకున్నాయ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున బస్సు తగలబడి 19 మంది సజీవదహనమైన ప్రమాదంపై పోలీసు అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు సీసీటీవీ ఫుటేజిలను విశ్లేషిస్తున్నారు. శివశంకర్‌ ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైన పది నిమిషాల తరువాత ట్రావెల్స్‌ బస్సు దాన్ని ఢీకొట్టినట్లు గుర్తించారు. ఆ పది నిమిషాల సమయంలో సుమారు 19 వాహనాలు ఆ మార్గంలో ప్రయాణించినట్లు తేల్చారు. వారిలో ఒక్కరు స్పందించి, ఆ వాహనాన్ని పక్కకు లాగినా 19 మంది ప్రాణాలతో ఉండేవారని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వాహనాల డ్రైవర్లతోనూ, మరికొందరితోనూ మాట్లాడారు. ద్విచక్రవాహనం రోడ్డుపై ఉండటాన్ని తాము చూశామని, దాని పక్క నుంచి వెళ్లిపోయామని వారు చెప్పారు. శివశంకర్‌ మృతదేహాన్ని ఎర్రిస్వామి పక్కకు లాగిన దృశ్యాన్ని కూడా చూసినట్లు కొందరు అంగీకరించారు. శివశంకర్‌ చనిపోయాడని తాము అనుకోలేదని, ప్రమాదంలో స్పృహ కోల్పోతే పక్కకు లాగుతున్నట్లు భావించామని పోలీసులకు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -