నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్ మరియు వెండి ఆభరణాల బ్రాండ్ అయిన కుషల్స్, నేడు హైదరాబాద్‌లో 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండ్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. కొండాపూర్ స్టోర్‌లో భారీ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ఆకర్షణను మరియు ఉత్సాహాన్ని జోడిస్తూ, ఈ వేడుకలో ప్రముఖ దక్షిణ భారత అందాల నటి మరియు దక్షిణ భారతదేశం కోసం కుషల్స్ యొక్క కొత్త బ్రాండ్ అంబాసిడర్ ప్రియాంక మోహన్ హాజరయ్యారు.
కొత్తగా ప్రారంభించబడిన ప్రతి స్టోర్ సుమారు 1300 చదరపు అడుగుల నుండి 1700 చదరపు అడుగుల వరకు విస్తరించి, ఆత్మీయ, లీనమయ్యే, ఉన్నతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది. ఐదు వేలకు పైగా జాగ్రత్తగా రూపొందించిన డిజైన్లతో, ఈ స్టోర్ లు వేడుక నుండి సొగసైన వర్క్ వేర్ , అద్భుతమైన పెళ్లి సెట్లు మరియు రోజువారీ నిత్యావసరాలు వరకు విస్తృతమైన ఆభరణాలను ప్రదర్శిస్తాయి. యాంటిక్, కుందన్, జిర్కాన్, టెంపుల్ మరియు స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాలతో సహా విభిన్న శ్రేణి డిజైన్లను వినియోగదారులు అన్వేషించవచ్చు.
నెక్లెస్‌లు, చోకర్లు, చెవిరింగ్ లు , ఫింగర్ రింగ్‌లు, పెండెంట్ సెట్‌లు, బ్రాస్‌లెట్‌లు, కడాలు, మాంగ్ టికాలు మరియు బ్రోచెస్‌ల యొక్క వైవిధ్యమైన ఎంపికతో సహా విస్తృత శ్రేణి అభిరుచులు , ప్రాధాన్యతలకు అనుగుణంగా కుషల్స్ ఆభరణాలు అందిస్తుంది-సాంప్రదాయ భారతీయ సౌందర్యశాస్త్రం , సమకాలీన ఫ్యాషన్ ఎంపికలకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
ఈ విస్తరణ గురించి కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెటింగ్ డైరెక్టర్ అంకిత్ గులేచా మాట్లాడుతూ, “ఫ్యాషన్ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్, హైదరాబాద్. ఇక్కడి వినియోగదారులు ఫ్యాషన్ మరియు ఆభరణాలలోని సరికొత్త పోకడల గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. గత కొద్ది సంవత్సరాలుగా, నగరంలో కుషల్స్ కలెక్షన్‌లకు మరియు బ్రాండ్‌కు స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది, హైదరాబాద్ షాపర్ల తో మా బలమైన సంబంధాన్ని పునరుద్ఘాటిస్తోంది. మేము మా కార్యకలాపాలను విస్తరిస్తూన్న వేళ, అధిక-నాణ్యత కలిగిన పనితనం , విస్తృత శ్రేణి ఆకర్షణీయమైన ఆభరణాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము, అదే సమయంలో నగరంలో మరిన్ని దుకాణాలను ప్రారంభించడం ద్వారా కుషల్స్‌ను హైదరాబాద్ అంతటా మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటి ప్రియాంక మోహన్ మాట్లాడుతూ, “కుషల్స్ ఆభరణాలు సంప్రదాయం, ఆధునిక డిజైన్‌ను అందంగా సమతుల్యం చేస్తాయి. ఈ కలెక్షన్లు ఆకర్షణీయమైనవి, వైవిధ్యతతో కూడి ఉన్నవి. పండుగ వేడుకలకైనా లేదా సాధారణ రోజు అయినా స్టైల్ చేయడానికి అత్యంత సులభమైనవి. వ్యక్తిగతంగా నేను ధరించడానికి ఇష్టపడే బ్రాండ్ ఇది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగం కావడం మరియు కుషల్స్ తమ వినియోగదారులకు ఇంత విస్తృత శ్రేణిలో ఆలోచనాత్మకంగా రూపొందించిన ఆభరణాలను తీసుకురావడం చూడటం నాకు సంతోషంగా ఉంది” అని అన్నారు.
ఈ సందర్భాన్ని వేడుక చేసుకునేందుకు, కొనుగోలుదారుల కోసం ప్రత్యేకమైన ప్రారంభోత్సవ ఆఫర్‌లను కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ అందిస్తోంది. ఈ ప్రారంభంతో, కుషల్స్ ఇప్పుడు హైదరాబాద్‌లో మొత్తం 17 స్టోర్‌లను కలిగి ఉంది, ఇది తెలంగాణలో బ్రాండ్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుంది , రాష్ట్రవ్యాప్తంగా కస్టమర్‌లకు దగ్గర చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 20 స్టోర్‌లను చేరుకోవాలని బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశ వ్యాప్తంగా 40 నగరాల్లో 100కు పైగా స్టోర్‌లు మరియు kushals.comలో బలమైన ఆన్‌లైన్ ఉనికితో, బ్రాండ్ తన వేగవంతమైన విస్తరణ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది, రాబోయే మూడు సంవత్సరాలలో భారతదేశం అంతటా 300 కి పైగా స్టోర్‌లను తెరవాలని ప్రణాళికలు చేస్తోంది . దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఫ్యాషన్, అధిక-నాణ్యత కలిగిన ఆభరణాలను తీసుకురావాలనే బ్రాండ్ లక్ష్యంను హైదరాబాద్ లోని ఈ ప్రారంభోత్సవాలు మరింతగా పునరుద్ఘాటిస్తాయి.
నల్లగండ్ల, కూకట్‌పల్లి, లేక్‌షోర్ వై జంక్షన్ మాల్ మరియు కొండాపూర్‌లోని మా కొత్త హైదరాబాద్ స్టోర్‌లను సందర్శించి తాజా కలెక్షన్‌లను అన్వేషించండి. స్టోర్ సమయాలు: ఉదయం 11:00 నుండి రాత్రి 9:00 వరకు.



