Thursday, September 25, 2025
E-PAPER
Homeజాతీయంలడఖ్ అల్లర్ల..సోనమ్ వాంగ్‌చుక్‌పై సీబీఐ దర్యాప్తు

లడఖ్ అల్లర్ల..సోనమ్ వాంగ్‌చుక్‌పై సీబీఐ దర్యాప్తు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: లడఖ్ అల్లర్ల నేపథ్యంలో వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగింది. ఆయ‌నకు చెందిన‌ ఎన్జీవో హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ లెర్నింగ్‌‌పై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ కాంట్రిబ్యూషన్ (నియంత్రణ) చట్టం ఉల్లంఘించిందా? అన్న దానిపై విచారణ చేపట్టింది. అయితే ఎన్జీవో ఎఫ్‌సీఆర్‌ఏ ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా కేంద్రం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్ బుక్ చేయలేదు గానీ.. విచారణ మాత్రం ప్రారంభించింది. దర్యాప్తులో ఆధారాలు దొరికితే మాత్రం కేసు బుక్ చేసేందుకు సిద్ధపడుతోంది.

గత కొద్ది రోజులుగా లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని లేహ్‌లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగిన విష‌యం తెలిసిందే. బీజేపీ కార్యాలయం సహా పలు కార్యాలయాలను ధ్వంసం చేసి తగలబెట్టారు. అంతేకాకుండా పోలీస్ వాహనాలను, ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంస చేశారు. అయితే ఈ హింసకు సోనమ్ వాంగ్‌చుక్‌నే కారణంగా కేంద్రం భావిస్తోంది.

వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పై బీజేపీ ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -